ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చైతన్య పరిచిన ప్రజా చైతన్య యాత్ర...



 ఎర్రజెండాల రెపరెపల మధ్య ఖమ్మం రూరల్‌లో ఉత్సాహంగా ప్రారంభం

తల్లంపాడు నుంచి పొన్నెకల్లు వరకు కదం తొక్కిన కామ్రేడ్స్

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన సిపిఐ పాదయాత్ర

ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: "బదలావ్ జరూరి హై... మార్పు కావాలి" అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఖమ్మం రూరల్ మండలంలో గురువారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఎర్రజెండాల రెపరెపలు, విప్లవ నినాదాలు, డప్పుల మోగింపులతో తల్లంపాడు గ్రామం చైతన్య వేదికగా మారింది.తల్లంపాడు వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రకు సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు డప్పు కొట్టి శ్రీకారం చుట్టగా, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎర్రజెండాలను చేతబట్టి కామ్రేడ్స్ క్రమశిక్షణతో హైవేపై ముందుకు సాగుతూ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.యాత్ర తల్లంపాడు నుంచి పొన్నెకల్లు వరకు సాగుతూ దారిపొడవునా గ్రామ ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, ఇబ్బందులు, స్థానిక అవసరాలను తెలుసుకుంది. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని సిపిఐ నాయకులు హామీ ఇచ్చారు.ఈ ప్రజా చైతన్య యాత్ర మద్దులపల్లి, వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండా, నాయుడుపేట, చిన్నతండా, తాళ్లేసి తండా, ఎదులాపురం, గొల్లగూడెం, ముత్తగూడెం గ్రామాల మీదుగా కొనసాగింది. అనంతరం రెడ్డిపల్లి, ఎం. వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం, కసన తండా, తనగంపాడు, తీర్థాల, కామంచికల్లు, రామన్నపేట మీదుగా దానవాయిగూడెం వరకు పాదయాత్ర కొనసాగనుంది.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, సామాన్య ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ యాత్రకు గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే కళాకారులు పాడిన పాటలు ఆడిన ఆట ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి . విప్లవ నినాదాలతో మారుమోగిన ఈ పాదయాత్ర ఖమ్మం రూరల్‌లో రాజకీయ, సామాజిక చైతన్యానికి కొత్త ఊపునిచ్చిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم