ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బీసీలకు సగం వాటా దక్కాల్సిందే


 జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి: బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సగం వాటా దక్కినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా బీసీలకు రాజకీయ స్వేచ్ఛ, తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం విచారకరమన్నారు. ఖమ్మం రూరల్ మండలం మారెమ్మ దేవాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ మేనిఫెస్టో పుస్తకాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి జీవి, ప్రతి వస్తువు లెక్కలు తేల్చే వ్యవస్థ ఉన్నప్పటికీ, సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల జనాభా ఎంతనేది ఇప్పటికీ స్పష్టంగా తేల్చకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పులులను వాటి అడుగుజాడల ఆధారంగా లెక్కిస్తారని, రోడ్డు పక్కన ఉన్న మొక్కలను సైతం లెక్కిస్తారని, పశువులకు సంఖ్య కేటాయించి గుర్తింపు ఇస్తారని పేర్కొన్నారు. అలాంటిది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీల కచ్చితమైన జనాభా లెక్కలు ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఉపకులానికి ప్రత్యేక కోడ్ నంబర్ కేటాయించి, అన్ని బీసీ కులాలను కచ్చితంగా నమోదు చేయాలని కోరారు. కులగణనలో ఏ ఒక్క బీసీ కులం, ఉపకులం కూడా విస్మరణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. బీసీల జనాభాను కచ్చితంగా లెక్కించకుండా వారికి తగిన రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. జనాభా ఎంత ఉందో తేలితేనే వారి హక్కులు, వాటా, ప్రాతినిధ్యంపై సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

అన్యాయం జరిగితే ఉద్యమం ఉధృతం

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ కులగణనలో బీసీలకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బీసీల హక్కుల విషయంలో ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కీర్తిశేషులు వనజీవి రామయ్య సతీమణి ధరిపెల్లి జానమ్మ, బీసీ మహిళా నాయకురాలు పద్మ, శశికుమార్, అన్నం వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم