ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జిగా కీలారు వెంకటరమణ



మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ ను కలిసి అందజేత

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీల ఇన్‌చార్జిగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు కీలారు వెంకటరమణ నియమితులయ్యారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆయనను ఇన్‌చార్జిగా నియమించారు. శనివారం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్‌ను కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అలాగే నియామకలలో సహకరించాల్సిందిగా కోరారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది