కాలి బూడిదైన వెంకటనర్సమ్మ
కూతురి జీవితం నాశనం చేస్తున్నాడని మందలించటమే పాపమైందా...?ఆస్తి వివాదమా ...?
- విచారణ చేపట్టిన పోలీసులు
ప్రజాపక్షం /సత్తుపల్లి : మండల పరిదిలోని తుమ్మూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో అత్తను అల్లుడు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.తుంబూరు గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ మూడు రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఆమె అల్లుడు గుండాల తిరుపతిరావుపై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.తిరుపతిరావును పోలీసులు అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించగా, నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. మృతదేహన్ని నారాయణపురం,బేతుపల్లి గ్రామాల మద్యలోని రహదారి పక్కన పోట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేశాడు.ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు ఆస్తి వివాదమే కారణమా? , గత కొన్ని రోజుల క్రితం కూతురి జీవితం నాశనం చేస్తున్నాడని తెలుసుకున్న అత్త, అల్లుడిని మందలించటంతో కోపంతో జరిగిన హత్య మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి