ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏసీపీ కి సిఐటియుసి వినతి


రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి : సిఐటియు జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్

వరంగల్ క్రాస్ రోడ్, నాయుడుపేట జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రయత్నం : ఏసిపి తిరుపతిరెడ్డి

 ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన కూడళ్ళు అయిన వరంగల్ క్రాస్ రోడ్డు,నాయుడు పేట జంక్షన్( రామ్ లీలా ఫంక్షన్ హాల్ దగ్గర )ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఐటీయూ ఏదులాపురం మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో రూరల్  ఏసీపీ తిరుపతి రెడ్డికి వినతి పత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు షేక్బషీరుద్దీన్ మాట్లాడుతూ ఖమ్మం నగరానికి అనుకుని ఉండటం,వరంగల్ మరియు హైదరాబాద్ నగరాలకు వెళ్ళడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో  రహదారులు, కూడళ్ల వద్ద నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోందని ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడళ్ల వద్ద వాహనాలు ఇష్టానుసారంగా రాకపోకలు సాగించడంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టి, వాహనదారులు మరియు పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఏసిపి తిరుపతిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్య గురించి పైఅధికారులు , మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కస్తాల  ఆంటోనీ,ఏటుకూరి ప్రసాద్,పుల్లయ్య, కుమ్మరి కుంట్ల శ్రీను, గోవిందు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم