భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించిన ప్రజలు
గ్రామ సర్పంచ్ బండి సతీష్ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : అరేంపుల గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి బోనాల వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి సుఖశాంతులు, సిరిసంపదలు, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. బోనాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సర్పంచ్ బండి సతీష్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా ముత్యాలమ్మ బోనాలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు విజయవంతంగా సాగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

إرسال تعليق