పార్టీ జెండా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గూడూరుపాడు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు చల్ల వలరాజు గురువారం సీపీఐలో చేరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండు సురేష్ పార్టీ జెండా కప్పి వలరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దండు సురేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై పలువురు సీపీఐలో చేరుతున్నారని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐలో చేరిన చల్ల వలరాజుకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గ్రామంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పుచ్చకాయల కమలాకర్, రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కరుణకుమార్, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, గ్రామ శాఖ కార్యదర్శి బండి సాయి, సహాయ కార్యదర్శి దాసరి పున్నయ్య, మాజీ సర్పంచ్ బండి ఉపేందర్, కర్ణం ఉపేందర్, బండి సతీష్, పోటు నాగరాజు, చల్ల రామకృష్ణ, నాగేందర్, రజినీకాంత్, గోకినపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి