ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ముదిగొండలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల స్పెషల్ డ్రైవ్


 
17 ఇసుక ట్రాక్టర్లు సీజ్.. 24 మందిపై కేసులు

ప్రజాపక్షం / ముదిగొండ: మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై ముదిగొండ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వీవీ కృష్ణాపురం సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను ఎస్‌ఐ హరిత తన సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అనంతరం ఉదయం 7 గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలో మరో ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మొత్తం 17 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, వాటి డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన ట్రాక్టర్లు పెదమండవ, గంధసిరి గ్రామాలకు చెందినవిగా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తం 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఎస్‌ఐ హరితతో పాటు పోలీస్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, శ్రీను, వెంకట్, కృష్ణ, రాజు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది