మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో చేరికలు
ప్రజాపక్షం /ఖమ్మం రూరల్: ఎం. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. సీపీఎంకు చెందిన తమ్మనబోయిన చిన్న వీరయ్య, తమ్మనబోయిన వెంకటరమణ, తమ్మనబోయిన నరేందర్, రాయగిరి నాగరాజు, కొమరగిరి అన్నపూర్ణ, రాయగిరి పుష్ప, తమ్మనబోయిన పార్వతి, కోసంగి ఉమేష్, శీలం సత్యనారాయణ, శీలం ఈశ్వర్, సామల విజయ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకుడు పడిగల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మందపల్లి నాగమణి, మద్దెల నాగయ్య, నరసింహ, లింగ శ్రీనివాసరావు, బుర్ర రాజేష్, టీమ్ పొంగులేటి పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరెంపుల బద్రిసాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి