ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పాల్వంచలో యువతిపై లైంగిక దాడి ఆరోపణలు.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ధర్నా


 ప్రజాపక్షం/పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని రూరల్ పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన వజ్జ వనితపై లైంగిక దాడికి పాల్పడి, పెళ్లి చేసుకోకుండా మోసం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి ఇంటి వద్ద ధర్నాకు దిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపురం గ్రామానికి చెందిన వజ్జ వనితకు, కోడిపుంజుల గ్రామానికి చెందిన భూక్యా అభితో గత రెండేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి అభి, వనితను పుల్లయ్యగూడెం గ్రామ పరిధిలోని డంపింగ్‌ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లినట్లు వనిత ఆరోపించింది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు, అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పి తనను తీవ్రంగా కొట్టినట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన వనిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడికి రావాలని కోరినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే అభి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు, సుమారు రాత్రి 1 గంట సమయంలో అతను పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. అయితే వనిత మాత్రం తనకు న్యాయం చేయాలని కోరుతూ అభి ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి ఇప్పుడు తనను ఒంటరిగా వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అభి తనను పెళ్లి చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ధర్నా కొనసాగిస్తోంది.ఈ ఘటనపై వనిత, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది