ప్రజాపక్షం/వైరా : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మంలో మాజీ జెడ్పీటీసీ, వైరా మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా ఉమాదేవి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగులేటిని కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని ఉమాదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బొర్రా ఉమాదేవి మాట్లాడుతూ రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి రాఖీ కట్టడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, దొడ్డ నగేష్, బొడ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పలువురు నాయకులు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పొంగులేటికి రాఖీ కట్టిన బొర్రా ఉమాదేవి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి