కృతజ్ఞతలు తెలిపిన 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి ఖమ్మం రూరల్ మండలం విలేకరులు సంఘీభావంగా తమ వంతుగా విరాళాన్ని అందించారు. 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు కోరిక మేరకు మంగళవారం విలేకరులు ఫోన్‌పే ద్వారా సీపీఐ అధికారిక స్కానర్‌కు విరాళాన్ని పంపించారు. ఈ మేరకు విలేకరులు వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, రంగారావు, అశోక్, వెంకట్, లక్ష్మణ్ తదితరులు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా దండి రంగారావు ర్యాలీకి విలేకరులు అందించిన సహకారం అభినందనీయమని పేర్కొంటూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

إرسال تعليق