ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మంలో నిధి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను పరిశీలించిన బీఆర్ షఫీ


 ప్రజాపక్షం/ఖమ్మం: నగరంలోని నిధి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సోమవారం మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్, బిజినెస్ కన్సల్టెంట్, ఎడ్యుకేటర్ బి.ఆర్. షేక్ షఫీఉల్లా (బీఆర్ షఫీ) పరిశీలించారు. ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకున్న ఆయనకు నిర్వాహకుడు ఉప్పలాచారి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బీఆర్ షఫీ విద్యార్థులు, యువతకు మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ సెమినార్ నిర్వహించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు.గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం సాఫ్ట్‌వేర్ రంగంలో శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేస్తున్న నిధి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు ఉప్పలాచారిని బీఆర్ షఫీ అభినందించారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ అవసరమని పేర్కొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم