ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

1000 రోజుల ప్రజాపాలనపై కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్



 ప్రజాపక్షం/వైరా: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైరా రింగ్ రోడ్డు వద్ద ఆదివారం కేక్ కటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ , పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వైరా నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో వైరా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు. 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, ఆత్మ చైర్మన్ మత్తూరు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి వీరంశెట్టి సీతారాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకం జైపాల్, జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు పణితి సైదులు, బత్తుల సుమతి , ఉండ్రు శ్యాంబాబు, ధర్నా రాజశేఖర్, మచ్చ బుజ్జి పొదిల హరినాథ్, చెరుకూరి కిరణ్, వీరయ్య, మేడూరి రామారావు, బిడికి రత్నం,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది