ప్రజా పక్షం/వైరా: వైరా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చరిత అడ్వాన్స్‌డ్ డెంటల్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు క్లినిక్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న ఆధునిక దంత వైద్య సేవలు, వైద్య పరికరాలు, చికిత్సా విధానాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వైరా పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక దంత వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దంత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్న వయసు నుంచే దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో వివిధ దంత సమస్యలకు సమగ్ర చికిత్స అందించడమే తమ లక్ష్యమని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు.ఈకార్యక్రమంలో వైద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, క్లినిక్ సిబ్బంది, ప్రజలు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి