స్నేక్ క్యాచర్ సూర్య సహకారంతో సురక్షితంగా పట్టుకున్న కాలనీవాసులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం రాత్రి భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు స్నేక్ క్యాచర్ సూర్య సహకారంతో కొండచిలువను ఎలాంటి హాని కలగకుండా ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా, నిన్న టీఎన్జీవోస్ కాలనీలో, తాజాగా ఇందిరమ్మ కాలనీలో కొండచిలువలు కనిపించడంతో ఆయా కాలనీల ప్రజలు భయకంపితులవుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి