ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బాల్య వివాహం.. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు


 ప్రజాపక్షం/నేలకొండపల్లి: బాల్య వివాహం జరిగిన ఘటనపై నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండల కేంద్రంలో శనివారం బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానికులు 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. నేలకొండపల్లికి చెందిన యువకుడితో బాలికకు అప్పటికే వివాహం జరిగినట్లు అధికారులు గుర్తించారు. బాలిక వయసు 17 సంవత్సరాలు కావడంతో సంబంధిత పత్రాలను పరిశీలించి వయసును నిర్ధారించారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక మైనర్‌గా నిర్ధారణ కావడంతో పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే, మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు ఇరువురూ హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగమణి, సీడబ్ల్యుసీ ప్రతినిధి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మైనర్ బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది