గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
ప్రజాపక్షం/కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో మంగళవారం నాడు నేలకొండపల్లి రోడ్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 1500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు గంగాధర్ జ్యూవెలరీ, మీసేవ సీతయ్య, సైదులు కిరాణం,శ్రీ లక్ష్మీ భవాని లేడీస్ టైలర్స్, వీరన్న జ్యువెలర్స్ చిరు వ్యాపారి పానీపూరి మినీష్ తదితరుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని అందించారు.గణేష్ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం భక్తులు, స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో సుమారు 1,500 మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమకెంతో తృప్తిగా ఆనందంగా ఉన్నదని తెలిపారు. కార్యక్రమం సజావుగా జరిగేలా శ్యామ్యాలు టెంట్ హౌస్ లు ఏర్పాట్లు చేశారు గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని నిర్వాహకులు తెలుపుతూ.,.. భవిష్యత్‌లోనూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా హార్దికంగా ఇంకాఅన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. కృతజ్ఞతలు తెలిపిన వారిలో గణేశ ఉత్సవ కమిటీ నిర్వాహకులైన ప్రముఖ నగల వ్యాపారి గడిపల్లి గంగాధర్, మీసేవ సీతయ్య, కిరాణం షాప్ సైదులు, గంగాభవాని టైలర్ షాపు k వాసు,గోల్డ్ షాప్ వీరన్న, , చిరు వ్యాపారి, పానీపూరి నిర్వాహకుడు మినిష్ తదితరులు ఉన్నారు.


إرسال تعليق