ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వినాయక నిమజ్జన వేడుకల్లో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు కాంగ్రెస్ రంగు కూడా ప్రత్యేకంగా కనిపించింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో శ్రీ స్వేచ్ఛ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో మహిళలు మూడు రంగుల చీరలు ధరించి ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలంతా ఒకే తరహాలో మూడు రంగుల చీరలు ధరించి వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనడంతో కార్యక్రమానికి ప్రత్యేక శోభ వచ్చింది. భక్తిగీతాలు, నృత్యాలతో ఉత్సాహంగా సాగిన ఊరేగింపులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ బానోతు ప్రసాద్‌కు సంబంధించిన శ్రీ స్వేచ్ఛ ఉత్సవ కమిటీ కావడంతో వేడుకల్లో కాంగ్రెస్ రంగు మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా మహిళలు ధరించిన మూడు రంగుల చీరలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

إرسال تعليق