ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రూ.52 వేల నగదు తిరిగి ఇచ్చిన ఆపరేటర్ విజయ్



 

నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన మున్సిపల్ ఉద్యోగి.. కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అభినందనలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: పొరపాటున తన బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.52 వేల నగదును ఎలాంటి స్వార్థానికి తావులేకుండా తిరిగి పంపించి నిజాయితీని చాటుకున్నాడు మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్ బుద్ధి విజయ్. ఈ నిజాయితీని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సాలువతో సత్కరించి మంగళవారం అభినందించారు.వివరాల్లోకి వెళితే.. ఏదులాపురం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న బుద్ధి విజయ్ కుమార్ బ్యాంకు ఖాతాలోకి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లక్ష్మి పొరపాటున రూ.52,000 నగదును జమ చేశారు. కొంత సమయం తర్వాత తన ఖాతాలోకి గుర్తుతెలియని నగదు జమ అయినట్లు విజయ్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన నగదు, సంబంధిత వ్యక్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు వచ్చిన నగదు అడ్రస్సు ద్వారా ఆకుల లక్ష్మిని సంప్రదించి, నగదు పొరపాటున తన ఖాతాలోకి జమ అయిన విషయాన్ని తెలియజేశారు. ఆమెకు చెందిన మొత్తాన్ని నిర్ధారించుకున్న తర్వాత రూ.52 వేల నగదును ఫోన్‌పే ద్వారా పూర్తిగా తిరిగి పంపించారు. ఈ ఘటనలో విజయ్ వ్యవహరించిన తీరు మున్సిపల్ సిబ్బందితో పాటు పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ ప్రత్యేకంగా అభినందిస్తూ... విధి నిర్వహణలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు విజయ్ మంచి ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. తోటి సిబ్బంది వినయ్, రాజేశ్వరి, కృష్ణవేణి, సంధ్య కూడా విజయ్‌ను అభినందించారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది