ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎస్పీ టవర్స్‌లో ఘనంగా కుంకుమ పూజ, అన్నదానం


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల ఎస్పీ టవర్స్‌లో కాంగ్రెస్ యువజన నాయకుడు అంబటి ఈశ్వర్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు కుంకుమ పూజకు అవసరమైన సామాగ్రిని నిర్వాహకులు వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి ఈశ్వర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది