ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

59 అంశాలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం



 అభివృద్ధి పనులకై ఒకటి పాయింట్ 1.50 కోట్లకు పైగా ఖర్చు  నిర్ధారిస్తూ తీర్మానాలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: 26వ వార్డు పెద్దతండలోని ఎదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, ప్రజా సౌకర్యాలతో పాటు పలు అంశాలకు సంబంధించి 59 తీర్మానాలు చేశారు. సమావేశంలో వివిధ వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే రహదారుల నిర్మాణం, డ్రైనేజీలు, పైపులైన్లు, కల్వర్టులు, పాఠశాలలు, ప్రజా సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. పలు వార్డుల్లో లైన్ కేబుల్స్, నీటి సరఫరా, రోడ్డు మరమ్మతులు తదితర పనులకు కూడా ఆమోదం లభించింది. పారిశుధ్య విభాగానికి సంబంధించి చెత్త సేకరణ, స్వచ్ఛత కార్యక్రమాలు, పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సామగ్రి, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వాహనాలు, పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు కూడా పలు తీర్మానాలు చేశారు. మున్సిపాలిటీలోని వివిధ కార్యాలయాలు, వార్డుల్లో ఏసీలు, ఇన్వర్టర్లు, విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్యకలాపాలకు అవసరమైన పరికరాలు, సేవలను సమకూర్చుకునేందుకు నిధుల వినియోగానికి ఆమోదం తెలిపారు. అదేవిధంగా వివిధ వార్డుల్లో రోడ్డు పక్కన పేరుకుపోయిన మట్టి, చెత్త తొలగింపు, JCB ద్వారా శుభ్రపరిచే పనులు, పార్కుల నిర్వహణ, మొక్కలు మరియు పచ్చదనం పెంపొందించే చర్యలు, ప్రజా సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన పన్నుల రీ-అసెస్‌మెంట్ సర్వే, SIR కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సామగ్రి, ఇతర పరిపాలనా అంశాలపైనా కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు శ్రీధర్ రెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది