1.5 కిలోల ఎండు గంజాయి పట్టివేత.. ఒడిశా వ్యక్తిపై కేసు
ప్రజాపక్షం/ఖమ్మం : ఖమ్మం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్-1 సమీపంలోని ఆటో స్టాండ్ ప్రాంతంలో 1.5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన కె. సింహాద్రిరావును తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న బ్యాగులో 1.5 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.85 వేలుగా అధికారులు తెలిపారు. గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కె. సింహాద్రిరావుపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న గంజాయి, సెల్‌ఫోన్‌ను ఖమ్మం-1 ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్‌మెంట్) ఆర్. కిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్‌మెంట్ ఎస్సై సీహెచ్. శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. కానిస్టేబుళ్లు వెంకన్న, శివకుమార్, వీరబాబు, తిరుపతి, స్రవంతి, డ్రైవర్ సాయి, నవీన్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే టోల్‌ఫ్రీ నంబర్ 18004252523కు సమాచారం అందించాలని ఎస్సై శ్రీహరిరావు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి