ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ వద్ద సీపీఐ జాతీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బదలావు జరూరి హై” మహా ధర్నాలో ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన సీపీఐ నాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖమ్మం జిల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎదులాపురం మున్సిపాలిటీ సీపీఐ నాయకులు ఎర్రచొక్కాలు ధరించి ధర్నాలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశంలో మార్పు అవసరాన్ని చాటిచెప్పే నినాదాలతో వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎదులాపురం మున్సిపాలిటీ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. స్థానిక స్థాయి నుంచి దేశ రాజధాని వరకు పార్టీ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి