సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుదిమళ్ల ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో నిర్వహించిన నిరసనలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ రాములు, స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా ముత్తగూడెం ఉన్నత పాఠశాలలో కూడా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. నందులాల్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. కళ్యాణి, టీపీటీఎఫ్ మండల బాధ్యుడు బి. శంకర్, టీఎస్‌యూటీఎఫ్ మండల బాధ్యులు ఏ. ధనలక్ష్మి, కృష్ణమోహన్, షఫీ, నాగరాజు, పుష్పలత , తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముడుంబ రంగనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, సక్కుబాయి, వీరబాబు, రమాదేవి, వెంకట రావమ్మ, గోపాల్‌రావు, నీలిమ, సువర్ణతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి