కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం కాంగ్రెస్ సర్పంచ్ జాన్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఖమ్మం నగరంలోని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జాన్‌రెడ్డి కేక్ కట్ చేయించారు. అనంతరం మంత్రి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా కృషి చేయాలని, మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, నాయకులు మద్ది కిషోర్‌రెడ్డి, , తేజావత్ పంతులునాయక్, బండి మల్లిఖార్జున్, సురేష్, తల్లంపాడు సర్పంచ్ అంబేద్కర్ , మాజీ సర్పంచ్ ముత్యం కృష్ణారావు, గునిగంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి