ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

యూరియా ఇస్తారా...వ్యవసాయం వదిలేయమంటారా..!


 రైతు సంఘం పాలేరు డివిజన్ సభ్యులు ఎడ్ల తిరపతిరావు.

ప్రజాపక్షం/నేలకొండపల్లి : రైతులకు సరిపడా యూరియా ను అందించటంలో పూర్తిగా విఫలమయ్యారని రైతు సంఘం పాలేరు డివిజన్ కమిటి సభ్యులు ఎడ్ల తిరపతిరావు ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు...యూరియా ఇవ్వలేకుంటే ప్రభుత్వం చెప్పాలని.. లేకుంటే వ్యవసాయం ను వదిలియమంటారా అని ప్రశ్నించారు. తాను 25 ఎకరాలు సాగు చేస్తున్నానని... యూరియా లేక పొలం దెబ్బతింటుందన్నారు. యాఫ్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాఫ్ క్షణాలలోనే అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో యాప్ బుక్ కావటం లేదన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. యూరియా సరఫరా లో ఇలానే నిర్లక్ష్యం చేస్తే పంటలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యాప్ తో కాకుండా రైతులకు ప్రత్యామ్నయంగా యూరియా ను అందించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది