ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎమ్మెల్సీ తాత మధు రాజీనామా చేయాలి


 స్పీకర్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి : కట్ల రంగారావు 

ప్రజాపక్షం/ వైరా: శాసనసభాపతి పట్ల అవమానకరంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తాత మధు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నైతిక బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరారు. శాసనసభాపతిని అవమానించేలా మాట్లాడటం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమని వారు విమర్శించారు. అధికారం కోల్పోయిన అహంతోనే బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం ఉన్నప్పటికీ రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభాపతి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది