ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ జలగంనగర్ 4వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాలు-1, 2లో పోషణ మహా కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4వ వార్డు కౌన్సిలర్ బి.కుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు, పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పాల పదార్థాలు, రాగులు, రాజ్మా, శనగలు, చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను ప్రదర్శించి, వాటిలో ఉండే పోషక విలువలను వివరించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని ప్రతి గర్భిణీ, బాలింత తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాలతి కుమారి, పీఎస్ హెచ్ఎం ప్రసాద్, ఏఎన్ఎం ఎం.సంగమ్మ, వార్డు పెద్ద సంగయ్య, ఎస్కే అబ్దుల్, బి.సాయి, అంగన్వాడీ టీచర్లు ఉమ, భూలక్ష్మి, ఆశా కార్యకర్తలు నాగమణి, మమత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి