ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

‘80sట్రెండ్‌’లో పొంగులేటి.. ఫొటోలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

 ‘ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి’ అంటూ అభిమానుల పోస్టులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రస్తుతం సాంకేతిక ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చుట్టూ తిరుగుతోంది. రోజురోజుకూ ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు ఏఐతో రూపొందించిన ఫోటోలు, వీడియోలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ‘80s ట్రెండ్’ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఏఐ ‘80s ట్రెండ్’ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఫోటోలను గ్రూపుల్లో వీడియోల రూపంలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

“ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరిన మా శీనన్న గొప్పతనం” అంటూ తమదైన శైలిలో పోస్టులు చేస్తూ మంత్రి పొంగులేటిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రజల్లో క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐతో రూపొందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజకీయ నాయకులపై అభిమానాన్ని చాటుకునే విధానం కూడా కాలానుగుణంగా మారుతోందనడానికి ఈ ‘80s ట్రెండ్’ ఫోటోలు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది