సీసీ రోడ్డు పనుల కోసం నిల్వ చేసిన ఇసుక మాయం
10 ట్రిప్పుల ఇసుక, 5 ట్రిప్పుల కంకర్ తరలింపు మాయం
ఇప్పటికి మూడుసార్లు సర్పంచ్ ఇసుకదొంగిలించినట్లు కాంట్రాక్టర్ ఆరోపణ
పోలీసులతో కలిసి గాలింపు.. ట్రాక్టర్‌తో తప్పించుకున్న సర్పంచ్, అనుచరుడు
ప్రజాపక్షం/కూసుమంచి : తురకగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం గ్రామంలోని స్మశాన వాటిక వద్ద నిల్వ చేసిన ఇసుకను గురువారం రాత్రి 11 గంటల అనుమతి లేకుండా గ్రామ సర్పంచ్ బుర్ర కృష్ణయ్య తరలించిన విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ రాయల సీతయ్య కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కాంట్రాక్టర్ కాపలాదారు నరసయ్య ద్వారా సమాచారం అందడంతో అప్రమత్తమైన కాంట్రాక్టర్ ఇసుక, కంకర్ ఫోటోలు వీడియోలు తీసుకొని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఇసుక తరలింపునకు సంబంధించిన విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, సంబంధిత వ్యక్తులతో కలిసి గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సర్పంచ్, బుర్ర కృష్ణయ్య ఆయనతో ఉన్న మరో వ్యక్తి డాక్టర్ తో అక్కడి నుంచి పక్కన ఉన్న కిష్టాపురం వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
10 ట్రిప్పుల ఇసుక.. 5 ట్రిప్పుల కంకర్
సీసీ రోడ్డు పనుల కోసం నిల్వ చేసిన సుమారు 10 ట్రిప్పుల ఇసుక, 5 ట్రిప్పుల కంకర్ తరలింపునకు ప్రయత్నించినట్లు కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిర్మాణ పనుల కోసం తెచ్చిన సామగ్రి భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సర్పంచ్ తప్పును అంగీకరించినట్లు సమాచారం
గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఇసుక, కంకర, దొంగతనంపై నేరుగా కాంట్రాక్టర్ సర్పంచ్ ని అడగగా నేనే ఎత్తుకెళ్లానని అవి కూడా రెండు ట్రక్కులు మాత్రమేనని ఎత్తుకుపోయినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.
గతంలోనూ250 సిమెంట్ మాయం
ఇదిలా ఉండగా, తురకగూడెం గ్రామంలో ఇదే సర్పంచ్‌పై గతంలో రోడ్డు పనుల కోసం తీసుకొచ్చిన సుమారు 250 సిమెంట్ బస్తాలను ఒక గది లో తాళంతో భద్రపరచగా తాళం పగులగొట్టి తీసుకెళ్లారనే ఆరోపణలు కూడా ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారించాల్సి ఉన్నది.
పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి రానున్న వాస్తవాలు
ప్రస్తుతం ఇసుక తరలింపు వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇసుక ఎవరి ఆధీనంలో ఉంది? దానిని తరలించేందుకు అనుమతి ఉందా? ఇంకాఎంత పరిమాణంలో ఇసుక, కంకర్ ఎత్తుక పోయారు ? ఘటన సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు? వంటి అంశాలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి మూడుసార్లు ఇసుక దొంగతనం జరిగినట్లు కాంట్రాక్టర్ రాయలసీత ఆరోపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు నిజమా? లేక అపార్థమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి