సీపీఎం నేత పోతినేని
ప్రజాపక్షం/చింతకాని: రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా పోతినేని సుదర్శన్ రావు రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని పోతినేని అన్నారు. తక్షణమే సాగర్ నీరు విడుదల చేయాలని కనీసం ఆరుతడి పంటలకు నీటిని వారాబంధి ప్రకారమైన విడుదల చేయాలని కోరారు.పంటల సాగుకు రైతులు అధిక పెట్టుబడులు పెడుతున్నా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదని విమర్శించారు. తక్షణమే మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన బస్తాల డబ్బులను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అవసరమైన మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని యూరియా యాప్ ను రద్దు చేయాలని పోతినేని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి దేశ బోయిన ఉపేందర్, నాయకులు తోటకూరి వెంకటనర్సయ్య, వత్సవాయి జానకిరాములు, పులి యజ్ఞనారాయణ, కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి