ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వరసిద్ధి వినాయకుడికి ఘనంగా పూజలు



 శ్రీ లక్ష్మీ గణపతి హోమం

ప్రజాపక్షం/ఖమ్మం :  ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోగల తారకరామా ఆటోనగర్లో ఫోర్ వీలర్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలకు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ ఏడాది కూడా కానిపాక విగ్నేశ్వర ప్రతిష్ట అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం సోమవారం ఘనంగా నిర్వహించారు. మండపం వద్ద ప్రతిరోజు గణపతి మాల వేసుకున్న స్వాములకు అన్నదానం నిర్వహించబడును. అదేవిధంగా సరస్వతి పూజ ,సిద్ధి బుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శాకాలాంబరి అలంకరణ, కుంకుమ పూజ , మహా అన్నదానం నిర్వహించబడతాయని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాల విజయవంతం చేయాలని కమిటీ వారు తెలియజేశారు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహంకాళి మల్లికార్జునరావు, కేశ గాని రవి, గుజ్జుల వెంకట రెడ్డి ,దొంతర బోయిన భద్రం, కనకం రామకృష్ణ కొనకటి షామేందర్ రెడ్డి, గంగవరపు శ్రీనివాసరావు, పగడం ప్రసాద్, గన్న శ్రీనివాసరావు, రాకేష్ ,భాస్కర్, ఫోర్ వీలర్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది