ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తోందని 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో గల డీపీఈపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందించిన యూనిఫాంలను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దినేని ప్రసాద్, వెంపటి రవి, నలబోలు అనిత రెడ్డి, వడ్లకొండ భుజంగరావు, పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్లు బొడ్డు హర్షవర్ధన్, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق