ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30, 32వ వార్డులకు చెందిన సీపీఐ కౌన్సిలర్లు దండి శ్రీజలోకేష్, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డికి ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. గురువారం యాదగిరిగుట్టలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏఐవైఎఫ్ మూడో మహాసభల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మామిండ్ల శ్రీనాథ్ రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, దండి శ్రీజను రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌తో పాటు పలువురు సీపీఐ నాయకులు, యువజన సంఘం నాయకులు, సభ్యులు వారికి అభినందనలు తెలిపారు. ఖమ్మం రూరల్ ప్రాంత యువజన ఉద్యమానికి దక్కిన గౌరవంగా కొనియాడారు. ఏఐవైఎఫ్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిందిగా ఆకాంక్షించారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీలోకి ఇద్దరు ఎదులాపురం మున్సిపాలిటీ సీపీఐ కౌన్సిలర్లు
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి