ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

దండిగా 'భక్తి' చాటుకున్న దండి బ్రదర్స్




 రూ.22,016లకు లడ్డూ.. రూ.3,016లకు కలశం


మేళతాళాలతో ఇంటి వరకు ఊరేగింపు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు ఎస్సీ కాలనీలో విగ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుని లడ్డూ వేలంపాటలో దండి బ్రదర్స్ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. వేలంపాటలో రూ.22,016లకు లడ్డూను, రూ.3,016లకు కలశాన్ని దక్కించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దండి బ్రదర్స్‌ను మేళతాళాలతో ఘనంగా ఊరేగిస్తూ వారి ఇంటి వరకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఆదిత్యనగర్‌లో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో కర్నాటి వంశీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు రూ.23,316లకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే రూ.7,116లకు పి.సురేష్ కుటుంబ సభ్యులు కలశాన్ని దక్కించుకున్నారు. వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది