రూ.9,516లకు సొంతం.. మేళతాళాలతో లడ్డూ ఊరేగింపు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో స్థానిక కౌన్సిలర్ బోయిన కుమారి కుటుంబం లడ్డూను దక్కించుకుంది. రూ.9,516లకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు. అనంతరం కౌన్సిలర్ కుమారుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు బోయిన సాయి లడ్డూను నెత్తిపై పెట్టుకుని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, స్థానికులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బోయిన సంగయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి