జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటన.. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచన
ప్రజాపక్షం/ఖమ్మం : అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, గురువారం ప్రకటించిన సెలవుకు ప్రత్యామ్నాయంగా వచ్చే నెలలోని రెండో శనివారం విద్యాసంస్థలు సాధారణ పనిదినంగా పనిచేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

إرسال تعليق