ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

హ్యాపీ కిడ్స్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం


 సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చిన్నారులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో గల హ్యాపీ కిడ్స్ స్కూల్‌లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని చిన్నారుల సందడి మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చిన్నారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయుల గొప్పతనాన్ని, తమ జీవితాల్లో గురువుల పాత్రను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. చిన్నారుల ఆనందోత్సాహాలు, ముచ్చటైన కార్యక్రమాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞత భావాలను చిన్నారుల్లో పెంపొందించేలా పాఠశాల నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఆకట్టుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది