ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. పలు కుటుంబాలకు భరోసా


 

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో మృతి చెందిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన 38మందికి పైగా కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి.. ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపద కాలంలో ఆర్థికంగా అండగా నిలిచిన పీఎస్ఆర్ ట్రస్ట్ కు.. మృతుల కుటుంబ సభ్యులు దీవెనలు అందించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిషోర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పొంగులేటి అభిమానులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది