అఖిల భారత యువజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్షులు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్షులు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో ఆయన ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటులో స్థానిక గిరిజనుల హక్కులను పరిరక్షించడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక గిరిజనుల హక్కులను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని మహాసభ సైతం డిమాండ్ చేసింది.

إرسال تعليق