ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న సీఈసీ..
నేడు కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు
ప్రజాపక్షం/నేలకొండపల్లి: ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఈసీని తొలగించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

إرسال تعليق