ఎదులాపురంలో మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ లోని రాష్ట్రీయ రహదారిపై భారీ నిరసన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : దేశ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఎదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గల రాష్ట్రీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ... రాహుల్ గాంధీ ప్రశ్నించే గొంతును కేసులతో అణచివేయలేరని, ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఏ శక్తీ ఆపలేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసి రాహుల్ గాంధీని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
అదేవిధంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మల్లికార్జున్ ఖర్గేను అవమానించడం సరైనది కాదన్నారు. అనంతరం బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చర్యలను తీవ్రంగా ఖండించారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ నిరంతరం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబాత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు బానోతు దివ్య, వెంపటి ఉమా, బానోతు ప్రసాద్, సోమ వెంకటరెడ్డి, బుర్ర మహేష్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


إرسال تعليق