ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం


ప్రజాపక్షం/ తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పోలీసు వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎస్సై జగదీష్‌తో పాటు పోలీసు వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ వెంటనే ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సై జగదీష్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది