ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గణపారపు అనితకు కాంగ్రెస్ నాయకుల నివాళి

 

పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన భూక్యా సురేష్ నాయక

 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డుకు చెందిన గణపారపు నాగయ్య కుమార్తె గణపారపు అనిత (22) అనారోగ్యంతో మృతి చెందారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనిత మృతిచెందిన విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు వెంపటి సురేష్, గణపారపు వీరయ్య శనివారం ఆమె స్వగృహానికి వెళ్లి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన నాయకులు.. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి దేవయ్యచారి, మేళ్లచెరువు సురేష్, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది