ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త


ప్రజాపక్షం/ఖమ్మం: హైదరాబాద్‌ నుంచి ఖమ్మం ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నగరంలో రిజర్వేషన్‌ చేసుకుని బస్సు ఎక్కేందుకు కొత్తగా పలు బోర్డింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. MGBS బస్‌స్టేషన్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులకు కింది ప్రాంతాల్లో బోర్డింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

MGBS → నల్గొండ క్రాస్‌ రోడ్‌ → కొత్తపేట క్రాస్‌ రోడ్‌ → అష్టలక్ష్మి టెంపుల్‌ → LB నగర్‌ మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1665 → పనామా → హయత్‌నగర్‌ → పెద్ద అంబర్‌పేట్‌ → రామోజీ ఫిల్మ్‌ సిటీ → ORR ఎగ్జిట్‌–సంపూర్ణ హోటల్‌ → అబ్దుల్లాపూర్‌మెట్‌.

రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు తమకు అనుకూలమైన బోర్డింగ్‌ పాయింట్‌ నుంచి బస్సు ఎక్కే అవకాశం ఉండటంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని అధికారులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది