ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎలా ఉన్నావమ్మా... అక్షిత!


 ఇటీవల సీఎం సభకు వెళ్తూ గాయపడిన చిన్నారిని పరామర్శించిన మంత్రి పొంగులేటి

అధైర్యపడొద్దని భరోసా.. కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆప్యాయ పలకరింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడబిడ్డలను, తల్లులను, అన్నదమ్ములను ఇంటి మనుషులుగా భావిస్తూ ఆప్యాయంగా పలకరించే ఆయన.. తాజాగా ఓ చిన్నారిని కూడా అదే ఆత్మీయతతో పలకరించారు.

“ఎలా ఉన్నావమ్మా... అక్షిత?” అంటూ చిన్నారి రెంటాల అక్షితను ఆప్యాయంగా పలకరిస్తూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు చిన్నారితో ముచ్చటించి ధైర్యం చెప్పారు. ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన రెంటాల అక్షిత ఇటీవల సీఎం సభకు తన అమ్మమ్మతో కలిసి బస్సులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. బస్సు కిటికీ వద్ద కూర్చున్న అక్షిత చేతికి మరో బస్సు తగలడంతో కుడి చేతికి తీవ్ర గాయమైంది. ఈ విషయం గ్రామ సర్పంచ్‌ కుమ్మరి అంబేద్కర్‌ ద్వారా తెలుసుకున్న మంత్రి పొంగులేటి వెంటనే స్పందించి, తన ఆధ్వర్యంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స అనంతరం అక్షిత పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్షిత ఇంటికి వెళ్లిన మంత్రి పొంగులేటి ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్షిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి, ఎలాంటి అధైర్యం చెందవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి చూపిన ఆత్మీయతకు అక్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారితో మంత్రి పొంగులేటి ఆప్యాయంగా మాట్లాడిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా మంత్రి మానవీయతపై సంతోషం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది