ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వినాయక చవితికి సిద్ధమైన ప్రతిమలు



వైరా మధిర రోడ్డులో కొలువుదీరిన గణనాథులు...

ఆకట్టుకుంటున్న వైవిధ్యభరిత రూపాలు

ప్రజా పక్షం/వైరా: వినాయక చవితి ఉత్సవాలకు వైరా పట్టణం ముస్తాబవుతోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం పట్టణంలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల్లో శిల్పకారులు రేయింబవళ్లు శ్రమిస్తూ ప్రతిమలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వైరా–మధిర ప్రధాన రహదారిలో కమ్మవారి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీరామ వినాయక విగ్రహాల సేల్స్ పాయింట్ లో విగ్రహాల తయారీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో వినాయక విగ్రహాల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా.. ప్రస్తుతం వైరానే గణపతి ప్రతిమల తయారీకి ప్రత్యేక కేంద్రంగా ఎదుగుతోంది. పట్టణానికి చెందిన ఆవుల రామాంజనేయులు, శ్రీరాములు రాముల ఆవుల బాలకృష్ణ, రాజు మరియు కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన శిల్పకారులు ఇక్కడే విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒక అడుగు నుంచి ఏకంగా 32 అడుగుల ఎత్తు వరకు వివిధ పరిమాణాల్లో ప్రతిమలను రూపొందిస్తున్నారు.

వైవిధ్యభరిత రూపాల్లో గణనాథులు

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, విభిన్న ఆకృతులు–అలంకరణలతో గణనాథుడి ప్రతిమలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. మండపాల నిర్వాహకుల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా ఆర్డర్లు తీసుకుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. తయారీ కేంద్రాల వద్ద వరుసగా కొలువుదీరిన గణనాథుల ప్రతిమలు అటుగా వెళ్లే వాహనదారులు, భక్తులు, ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వైరాలో తయారవుతున్న వినాయక ప్రతిమలకు స్థానికంగా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ డిమాండ్ పెరగడంతో.. గణేష్ ఉత్సవాల సందడి ప్రారంభానికి ముందే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది