ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం: మంత్రి పొంగులేటి


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. “స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే” అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండాలని సూచించారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది