ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నేడు ప్రజావాణిలో బీఆర్ఎస్ వినతి


ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు నేడు ప్రజావాణిలో వినతి

ప్రజా హామీల అమలుకు డిమాండ్.. కందాళ ఆధ్వర్యంలో కార్యక్రమం

భారీగా తరలిరావాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య

ప్రజాపక్షం/కూసుమంచి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కందాళ ఉపేందర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వేముల వీరయ్య పిలుపునిచ్చారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది